ఒక సంతోషకరమైన సంఘటన

ఒక సంతోషకరమైన సంఘటన

 

ఇటీవల ఒక సాంఘిక వివాహానికి హాజరయ్యాను. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో ఆ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వాహకుడు జరిపించాడు. వధూవరులిద్దరితో తెలుగులో ప్రమాణ పత్రాలు చదివించి దండలు మార్పించడంతో వారిద్దరూ భార్యాభర్తలయ్యారని ప్రకటించారు.

 

ఆ తర్వాత కొంతమంది పెద్దలు వధూవరులిద్దరినీ అభినందిస్తూ ప్రసంగించారు. తెలుగులో ఈ పెళ్లి కార్యక్రమం వలన అందరకూ అర్థం అయిందని ఎక్కువమంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. సొంత లాభం కొంత మానుకొని సమాజ సేవ చేయాలని మరి కొంతమంది చెప్పారు.

 

చిట్టచివరి వక్త మాట్లాడిన విషయం విన్న తరువాత నాకు కలిగిన సంతోషాన్ని పంచుకోవాలనుకొంటున్నాను. ఆ మాటలివి….

 

“ఇక్కడ 10 సంవత్సరముల నుండీ 80 సంవత్సరముల వయస్సున్న వారలం ఉన్నాము. ఈ  పెళ్లి కార్యక్రమం మనందరకూ అర్థం అయ్యే తెలుగులో జరిగిందని సంతోషిస్తున్నాము. మంచిదే!

 

మరి 4-5 సంవత్సరపు పిల్లల్ని వారికి అర్థం కాని ఇంగ్లీషు మీడియంలో బోధించే పాఠశాలల్లో ఎందుకు జేర్పిస్తున్నారు? వారి బాల్యాన్ని సంతోషంగా గడపనివ్వలేమా? ఈ నూతన జంట తమ పిల్లల్ని చక్కగా వారి సొంత భాష అయిన తెలుగు మాధ్యమంలో చదివించి, ఉల్లాసకరమైన బాల్యాన్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

 

బాగున్నాయి కదా ఈ మాటలు!

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

 

One thought on “ఒక సంతోషకరమైన సంఘటన

  • July 19, 2018 at 8:34 pm
    Permalink

    తెలుగుపై మీకున్న అభిమానానికి ధన్యవాదాలు! ఆంగ్లమాధ్యమంలొ బోధించే పాఠశాలల్లో కూడా తెలుగు బొధిస్తారు అని తలుస్తాను. ఉన్నత విద్య అభ్యసించటానికి కావలసిన పుస్తకాలు చాలా వరకు ఆంగ్లంలోనే వున్నాయి కాబట్టి, ప్రాధమిక విద్య తరువాత ఆంగ్ల మాధ్యమం కావాలేమో? నేనీమధ్య చదివిన ఒక ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ http://eemaata.com/em/issues/201309/2335.html?allinonepage=1

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>