స్వచ్చ సుందర చల్లపల్లి – 21-07-2018
ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1348* రోజులు
ఈరోజు ఉదయం 4-15 నుండి 6-00 గంటల వరకు 40 మంది కార్యకర్తలు కాసానగర్ వద్ద రోడ్డుకిరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు.
“లక్ష్మీ సెల్వం గారు” చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 307 రోజులుగా కొనసాగుతున్నాయి.
ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శనివారం – 21-07-2018
ఒక కృతజ్ఞత – ఒక జ్ఞాపిక
డ్రైను ప్రక్కన సుఖసుఖంగా – ధైర్యముగ నడయాడు పెద్దలు
నిలువ నీరే లేని రోడ్డున నిశ్చింతగ కదలాడు పిన్నలు
పూల బాలల సోయగాలకు పరవశించే ఊరి జనములు
తలచు కొందుర? సహకరింతుర? స్వచ్ఛసైన్యం ఉదయ సేవలు?
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త