స్వచ్ఛ సుందర చల్లపల్లి – 24-07-2018

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
 
స్వచ్ఛ సుందర యజ్ఞం @ 1321* రోజులు
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 42 మంది కార్యకర్తలు ఉదయం 4-13 గంటల నుండి 6-10 గంటల వరకు నాగాయలంక రోడ్డులో అమరస్థూపం వద్ద నుండి నాగాయలంక రోడ్డుకు ఎడమవైపు డ్రెయిన్ గట్టుపై ఉన్న పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు.
 
కొంతమంది కార్యకర్తలు గతంలో పెట్టిన మొక్కలకు పాదులు చేశారు.
 
SRYSP వాకర్స్ ఈనాటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
చికాగో లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చల్లపల్లి వాస్తవ్యులు త్రివిక్రమ్, హైదరాబాద్ నుండి వచ్చిన గోవింద ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
“పూసపాటి బ్రహ్మానంద రావు” గారు, త్రివిక్రమ్ గారలు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
280 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “సెంటర్లో” కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
ఆదివారం – 24-06-2018
 
ఒకే ఒక్క సంరంభం
 
వినమ్రమూ – వినూత్నమైన వింతేదైనా ఉంటే –
ప్రసిద్ధమూ – విశుద్ధమైన వ్యసనం ఇపుడేదంటే –
సుశిక్షితము – విలక్షణమగు ఉద్యమమేదైన ఉంటే –
స్వచ్ఛోద్యమ చల్లపల్లి సంరంభం ఒక్కటే!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>